BJP: చివరికి మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు: కన్నా లక్ష్మీనారాయణ
- ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు
- అధికారంలోకి వచ్చి దోపిడీ సర్కారును కొనసాగిస్తున్నారు
- కేంద్రం నుంచి రూ.1,55,000 కోట్ల నిధులు వచ్చాయి
- మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ అక్రమాలు
టీడీపీ నేతలు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, చివరికి మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత దోపిడీ సర్కారుని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి కేంద్ర సర్కారు ఇప్పటివరకు రూ.1,55,000 కోట్ల నిధులను ఇచ్చిందని అన్నారు. కేంద్ర సర్కారు మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. ఏపీలో అవినీతి, అరాచకాలే ఉన్నాయని, మంచి పాలన లేదని ఆయన వ్యాఖ్యానించారు.