: గులాంనబీ ఆజాద్ కు హోంశాఖ?


ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు నెలకొంటున్నాయి. మరో వారంరోజుల్లో క్యాబినెట్ ను పునర్వ్యస్థీకరించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో, పలు మార్పులు చేర్పులు తప్పవని తెలుస్తోంది. కాగా, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు ఇబ్బందుల్లో పడ్డ సుశీల్ కుమార్ షిండేను హోంశాఖ నుంచి తప్పించి, గులాంనబీ ఆజాద్ కు ఆ పదవి అప్పగించాలన్న యోచనలో యూపీఏ వ్యూహకర్తల యోచన అని సమాచారం.

షిండేను పార్టీ వ్యవహారాలకు ఉపయోగించుకోవాలని, వచ్చే ఏడాది మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతను షిండేకు అప్పగించాలని భావిస్తున్నారట. కాగా, రైల్వే మంత్రి బన్సల్, న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ లు పదవీచ్యుతులు కావడం తథ్యమని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News