: మెతుకు ముట్టని జగన్!


ఆశ నిరాశ అయితే, నిస్పృహ పతాకస్థాయికి చేరితే ఎవరైనా ఏం చేస్తారు? మనస్తాపం చెంది, ఆ బాధను ఏ భోజనం మీదనో చూపిస్తారు. మెతుకు ముట్టకుండా తమ వేదనను ప్రదర్శిస్తారు. అందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మినహాయింపు కాదు. ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న బెయిల్ వస్తుందని భావిస్తే, సుప్రీం నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఆయన ఖిన్నుడయ్యాడు.

చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్.. నిన్న మధ్యాహ్నం వరకు ఎంతో చలాకీగా కన్పించాడట. బెయిల్ పిటిషిన్ కొట్టివేస్తూ గురువారం సుప్రీం తీర్పు వెలువరించిన వెంటనే తన బ్యారక్ లోకి వెళ్ళి ఒంటరితనాన్ని ఆశ్రయించి, ఇతర వీఐపీ ఖైదీలనూ దూరంగా ఉంచినట్టు సమాచారం. అంతేగాకుండా, భోజనం సైతం స్వీకరించలేదట జగన్!

  • Loading...

More Telugu News