Chandrababu: అవినీతి పట్ల చండశాసనుడిలా ఉంటాను: చంద్రబాబు

  • ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను
  • అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేయించి బాధితులకు న్యాయం చేస్తాను
  • కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?
  • జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తులను స్వాధీనంలోకి తీసుకోవాలి

ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని, అవినీతి పట్ల చండశాసనుడిలా ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేయించి బాధితులకు న్యాయం చేస్తానని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. శ్రీవారి నగలు మాయమయినట్లు మాట్లాడుతున్నారని, ఇది బీజేపీ, వైసీపీ ఆడిన నాటకం కాదా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పాలన బాగోలేదని విమర్శించారు. బ్యాంకులు, ఏంటీఎంలలో డబ్బులు లేవని ఇదేం పరిపాలన? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News