Andhra Pradesh: ఉక్కుశాఖ మంత్రితో టీడీపీ ఎంపీల భేటీ
- ఢిల్లీలో సమావేశం
- కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వినతి
- భేటీలో పాల్గొన్న ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మరోసారి సమావేశమయ్యారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వారు నిన్న కూడా ఆయనను కలిసి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. నిన్న మీడియాతో మాట్లాడిన బీరేంద్రసింగ్.. ఉక్కు పరిశ్రమల ఏర్పాటు అధ్యాయం ముగిసిపోలేదని, పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎంత మేరకు అవసరమన్నది కన్సల్టెన్సీ సంస్థ చెబుతుందని వివరించారు. దీంతో ఉక్కు పరిశ్రమ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ఈరోజు మరోసారి ఆయన టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇక నేటి భేటీలో ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ కూడా పాల్గొన్నారు.