Chandrababu: సీబీఐతో దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదు: పురందేశ్వరి

  • ‘పోలవరం’ ఘనత కాంగ్రెస్ కు ఆపాదించొద్దు
  • కాంగ్రెస్ హయాంలో నయాపైసా కూడా మంజూరు కాలేదు 
  • యుటిలిటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి నిధులెలా వస్తాయి?

ఏపీ ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబుపైన సీబీఐ విచారణను బీజేపీ జరిపించదని, కక్ష గట్టడం, సీబీఐతో దాడులు చేయించడం వంటివి తమ పార్టీ సంస్కృతి కాదని ఆ పార్టీ మహిళా మోర్చా నేత పురందేశ్వరి అన్నారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఘనతను కాంగ్రెస్ కు ఆపాదించడం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నయాపైసా కూడా ఈ ప్రాజెక్ట్ కు మంజూరు చేయలేదని ఆరోపించారు. యుటిలిటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా మంజూరు చేస్తుందని ప్రశ్నించిన ఆమె, ఏపీకి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News