: వైభవంగా భక్త రామదాసు జయంతి వేడుకలు


ప్రముఖ వాగ్గేయ కారుడు కంచర్ల గోపన్న(భక్త రామదాసు) 380వ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం క్షేత్రంలో ఈ రోజు ఘనంగా జరిగాయి. పలువురు వాగ్గేయకారుల చిత్రపటాలను భక్తులు ఆలయం నుంచి తీసుకొచ్చి సంకీర్తనల నడుమ పట్టణమంతా ఊరేగించారు. తర్వాత ఆలయంలోని రామదాసు విగ్రహానికి పవిత్ర గోదావరి నుంచి తెచ్చిన జలాలు, పంచామృతాలతో వేద పండితులు అభిషేకం నిర్వహించారు. చిత్రకూట మండపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులతో ప్రత్యేక నాద నీరాజన కార్య్రక్రమం జరిగింది. రామదాసు జయంతి వేడుకల్లో భక్తులు విరివిగా పాల్గొని తరించారు.

  • Loading...

More Telugu News