Andhra Pradesh: ఏపీలో ఊమెన్ చాందీ పర్యటన ఖరారు
- నియోజక వర్గాల వారీగా సమీక్షలు
- వచ్చేనెల 9 నుంచి పర్యటన ప్రారంభం
- ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా పర్యటన
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ రాష్ట్రంలో తొలివిడత పర్యటనలో భాగంగా వచ్చేనెల 9 నుంచి 13వరకు జిల్లాల్లో పర్యటిస్తారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కార్యకర్తల సమావేశం అనంతరం నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు.
వచ్చేనెల 9న కృష్ణా జిల్లా, 10న గుంటూరు జిల్లా, 11న ఒంగోలు, 12న నెల్లూరు, 13న చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారని తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు ఊమెన్ చాందీతో ఈ అంశంపై ఈరోజు చర్చలు జరిపారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన ఉంటుంది.