sensex: నష్టాలతో ప్రారంభమైనా.. చివరకు స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు!

  • 20 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10,769 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
  • 16.10శాతం పెరిగిన అవంతి ఫీడ్స్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు... కాసేపటి తర్వాత కొంచెం మెరుగుపడి, చివరకు లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 20 పాయింట్లు పెరిగి 35,490కు చేరుకుంది. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 10,769 వద్ద స్థిర పడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అవంతి ఫీడ్స్ (16.10%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (7.74%), హెక్సావేర్ టెక్నాలజీస్ (5.25%), వక్రాంగీ (4.99%), ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ (4.55%).

టాప్ లూజర్స్:
ఐడీబీఐ బ్యాంక్ (-6.36%), ఏజీస్ లాజిస్టిక్స్ (-6.27%), గతి లిమిటెడ్ (-5.82%), జిందాల్ సా లిమిటెడ్ (-5.30%), ఫ్యూచర్ రీటెయిల్ (-5.14%).  

More Telugu News