VH: నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను: వీహెచ్
- పార్టీలో అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి
- దానం నాగేందర్ ఎందుకు వీడారో తెలియడం లేదు
- పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుతాను
తమ పార్టీ నేత దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరిన విషయంపై టీపీసీసీ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్టీలో అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉంటాయని అన్నారు. దానం నాగేందర్ పార్టీని ఎందుకు వీడారో తెలియడం లేదని చెప్పారు. తాను మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటానని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుతానని, నిలదీస్తానని అన్నారు, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయడమే తన విధని అన్నారు. తాను ఇందిరా గాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అభిమానినని అన్నారు.