Hyderabad: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కమ్ముకున్న మేఘాలు
- నాంపల్లి, లక్డీకపూల్ పరిసర ప్రాంతాల్లో వర్షం
- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం
వారం రోజులుగా ఎండల వేడిమితో సతమతమవుతోన్న హైదరాబాద్ వాసులు ఈరోజు చల్లటి వాతావరణాన్ని చూస్తున్నారు. నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.. పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నాంపల్లి, బేగంబజార్, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, బేగంపేట, సుల్తాన్ బజార్, లక్డీకపూల్తో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. కాగా, రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.