samanta: వంద మంది చిన్నారులకు ఏడాది పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నాం: స్ఫూర్తినిస్తోన్న సమంత ట్వీట్‌

  • అక్షయ పాత్ర ద్వారా చిన్నారులకు భోజనం
  • ఏడాదికి కేవ‌లం 950 రూపాయ‌లు విరాళంగా ఇవ్వండని సూచన
  • సమంతకు నెటిజన్ల అభినందనలు

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంతకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఆమె అనాథ పిల్లలతో పాటు పేద విద్యార్థులకు సాయం చేస్తుంటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇందులో అందరూ పాలు పంచుకోవాలని సందేశం ఇస్తోంది. స‌మంత తాజాగా చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తూ ఫొటో తీసుకుని త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ఏడాది తమ కుటుంబం వంద మంది పాఠశాల బాలలకు ఏడాది పాటు మధ్యాహ్న భోజ‌నం అందిస్తుందని తెలిపింది. ఏడాదికి కేవ‌లం 950 రూపాయ‌లు విరాళంగా ఇస్తే ఏడాది పాటు ఒక విద్యార్థికి రుచిక‌ర‌మైన, పౌష్టికాహార భోజ‌నం అందించవచ్చని, అక్ష‌య పాత్ర ఆర్గనైజేషన్‌ ద్వారా సాయం చేయండని కోరింది. https://www.akshayapatra.org/isharemylunch వెబ్‌సైట్‌ ద్వారా సాయం చేయవచ్చని సమంత సూచించింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

More Telugu News