: ప్రాణ్ కు దాదాసాహెబ్ పురస్కారం ప్రదానం
భారత సినీ రంగానికి విశేష సేవలందించిన నటుడు 93 ఏళ్ల ప్రాణ్(ప్రాణ్ కృష్ణ సికంద్)కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ అవార్డును కేంద్రమంత్రి మనీష్ తివారీ అందజేశారు. ముంబైలోని ప్రాణ్ నివాసానికి వెళ్లి మరీ ఈ అవార్డును ప్రదానం చేశారు. అనారోగ్య కారణాల వల్ల కొద్దిరోజుల కిందట ఢిల్లీలో జరిగిన సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రాణ్ హాజరు కాలేకపోయారు. దీంతో ఈ రోజు అవార్డును అందించారు. 1940 నుంచి 1990 వరకూ 50 ఏళ్ల కాలంలో ప్రాణ్ 350 చిత్రాలలో నటించారు. అన్ని రకాల పాత్రలతోనూ మెప్పించారు. జంజీర్, డాన్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.