USA: సెక్స్ రాకెట్ ను తవ్వి తీయించిన చిత్తు కాగితం... నేడు కోర్టు ముందుకు మోదుగుమూడి దంపతులు!

  • ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఫెడరల్ పోలీసులు
  • తెలుగు సంఘాల చరిత్రను తవ్వి తీస్తున్న అధికారులు
  • అమెరికా వెళ్లి డాలర్లు తెచ్చుకున్న హీరోయిన్లకు ఇబ్బందులే!
అమెరికాలో వెలుగులోకి వచ్చి కలకలం రేపిన తెలుగు సినీ మహిళా కళాకారుల సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు నేడు ఇల్లినాయిస్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ దంపతులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని అరెస్ట్ చేసిన పోలీసులకు దొరికిన ఓ చిత్తుకాగితం, భారీ సెక్స్ రాకెట్ పై హింట్ ఇవ్వగా, పోలీసులు ప్రస్తుతం అమెరికాలోని తెలుగు సంఘాల చరిత్రను తవ్వి తీస్తున్నారు.

ఇప్పటికే అమెరికా వెళ్లి, వ్యభిచారం చేశారన్న అనుమానాలున్న హీరోయిన్లను ప్రశ్నించిన అమెరికా పోలీసులు, మొత్తం విచారణ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. గడచిన వారం రోజులుగా యూఎస్ లోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులను విచారిస్తున్న పోలీసులకు, తాము నటీమణులకు విమానం టిక్కెట్లు ఇచ్చి పిలిపించి, బస ఏర్పాటు చేయిస్తామని, వారు ఆపై ఏం చేస్తారో తమకు తెలియదని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో హీరోయిన్ల బ్యాంకు ఖాతాలను, ఎయిర్ పోర్టులో జరిపిన ఫారెక్స్ లావాదేవీలను పరిశీలించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు, పెద్దఎత్తున వారి ఖాతాల్లో డాలర్లు జమైనట్టు గుర్తించారు. తమ బ్యాంకు ఖాతాల్లోకి డాలర్లను వేయించుకున్న హీరోయిన్లు, తిరిగి వచ్చే వేళ డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడంతో ఈ కేసులో వారు ఇబ్బందులు పడక తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
USA
Federal Bureau
Modugamudi Kishan
Chandrakala
Illinois
Arrest
Tollywood
S*x Rocket

More Telugu News