YSRCP: బుగ్గనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

  • స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిసిన టీడీపీ నేతలు
  • బుగ్గన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు 

ఢిల్లీలో బీజేపీ నేత రాం మాధవ్ ని ఇటీవల కలిసి కీలకపత్రాలు అందజేసిన పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలసి వారు ఫిర్యాదు చేశారు. పీఏసీ చైర్మన్ గా ఉన్న బుగ్గన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

కాగా, ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశానంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులకు  ప్రివిలేజ్ నోటీసులను రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల జారీ చేశారు.

  • Loading...

More Telugu News