: ఢిల్లీలో మరో పాఠశాల విద్యార్థి కాల్పులకు బలి
అమెరికా సంస్కృతి మనకూ పాకింది. ఏడాది వ్యవధిలోనే ముగ్గురు పాఠశాల విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో తుపాకీ తూటాలకు బలయ్యారు. వీరందరూ తోటి విద్యార్థులు జరిపిన కాల్పుల్లో హతమైనవారే. తాజాగా దక్షిణ ఢిల్లీలో మునిర్క ప్రాంతంలో ఇంట్లో ఉన్న 18 ఏళ్ల విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ బాలికకు తెలిసిన వ్యక్తే కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వరుస అత్యాచారాలతో మార్మోగుతున్న ఢిల్లీ పేరు కాల్పులకూ చిరునామాగా మారుతోంది.