: ఓటుకు రశీదుల విధానం వెంటనే ప్రవేశపెట్టాలి: చంద్రబాబు
ఎన్నికలలో ధనం, కండబలం పెచ్చుమీరిపోయాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ధనాధిపత్యానికి కళ్లెం వేసేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో ఈసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని, ఓటు ఎవరికి వేశామో ఓటర్లు తెలుసుకునే అవకాశం ఉండాలని కోరామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చి రశీదులు ఇచ్చే విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని అడిగినట్లుగా బాబు వివరించారు. మరోసారి రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లుగా వెల్లడించారు. దేశంలో నల్లడబ్బు రాజ్యమేలుతోందన్నారు.