: ఓటుకు రశీదుపై ఢిల్లీలో ఈసీ సమావేశం
ఓటువేసిన వెంటనే రశీదు, ఈవీఎంలు, ఎన్నికల విధానంలో మార్పులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం అయింది. పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని, దానికనుగుణంగా మార్పులు చేసేందుకు ఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇతర రాజకీయ పార్టీల నుంచీ కూడా ముఖ్య నేతలు హాజరయ్యారు