YSRCP: వైసీపీ ఎంతో ఇష్టంగా అడిగే ప్రశ్నకు సమాధానం దొరికింది: నారా లోకేశ్

  • ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయని వైసీపీ అడుగుతుంటుంది
  • వైసీపీ ఎంపీ లోక్ సభలో అడిగిన ప్రశ్నే ఇందుకు సమాధానం
  • ఓ ట్వీట్ చేసిన లోకేశ్

‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి?’ అని వైసీపీ నేతలు తరచుగా వేసే ప్రశ్నకు  సమాధానం దొరికిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అనేది వైసీపీకి ఇష్టమైన ప్రశ్న. దీనికి సమాధానం దొరికింది. వైసీపీ ఎంపీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సమాధానపు లేఖను ఇక్కడ జతపరుస్తున్నాను.

ఇందులో ఉన్న లెక్కలు తప్పా? అందుకే, అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయవద్దని మిమ్మల్ని చంద్రబాబునాయుడు రిక్వెస్ట్ చేసేది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్సును ఏర్పాటు చేసి, పరిశ్రమల శాఖా మంత్రి వ్యక్తిగతంగా తోడుండి, వైసీపీ నేతలను తీసుకెళ్లి, రాష్ట్రంలో ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేశారో, ఉద్యోగాలు ఎక్కడైతే కల్పించారో వాటిని చూపిస్తారు. ఇందుకు, వాళ్లు సిద్ధమేనా?’ అని తన ట్వీట్లో లోకేశ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News