Jagan: ఆత్రేయపురం పూతరేకులు రుచి చూసిన జగన్!
- తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
- ఆత్రేయపురంలో పూతరేకుల తయారీదారులను కలిసిన జగన్
- స్థానికురాలు తయారు చేసిన పూతరేకులను రుచి చూసిన అధినేత
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మూడో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఆత్రేయపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీదారులను జగన్ కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ స్థానికురాలు తయారు చేసిన పూతరేకులను జగన్ టేస్ట్ చేసి.. బాగున్నాయని ప్రశంసించారు.
కాగా, ఈరోజు పాదయాత్ర పేరవరం నుంచి ప్రారంభించి.. వెలిచేరు, వద్దిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి, ఉచ్చిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగింది.