Chandrababu: తప్పుడు లెక్కలతో ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేసిందని, తప్పుడు లెక్కలతో ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయవాడలో బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు హరిబాబు, పురందేశ్వరి, గోకరాజు గంగరాజు, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి హాజరయ్యారు.

 ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని, జనసేన, వైసీపీతో బీజేపీ కుమ్మక్కయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారాలను తిప్పిగొట్టేందుకు అన్ని జిల్లాల్లో యాత్రలు చేపడతామని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.
Chandrababu
kanna

More Telugu News