Jagan: రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
- గోదావరి వంతెన బలహీనంగా ఉంది
- ఎక్కువ మంది రావడం మంచిది కాదు
- ఓ లేఖ రాసిన రాజమండ్రి డీఎస్పీ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర కు అనుమతి లభించలేదు. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని సూచిస్తూ వైసీపీ ప్రతినిధులకు రాజమండ్రి డీఎస్పీ ఓ లేఖ రాశారు. గోదావరి వంతెన బలహీనంగా ఉందని, ఎక్కువ మంది రావడం మంచిది కాదని సూచించారు.
వంతెన పరిస్థితి సరిగా లేనందునే పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. నిడదవోలులో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.