Pranab Mukherjee: భరతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చా: ప్రణబ్ ముఖర్జీ

  • నాగపూర్ చేరుకున్న ప్రణబ్
  • హెడ్గేవార్ జన్మస్థలాన్ని, ఇంటిని సందర్శించిన మాజీ రాష్ట్రపతి
  • సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన ప్రణబ్ 

నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. హెడ్గేవార్ నివసించిన ఇంటిని పరిశీలించారు.‘భరతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చాను’ అంటూ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్ రాశారు. కొద్ది సేపట్లో ఆర్ఎస్ఎస్ సంఘ్ శిక్ష వర్గ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

  • Loading...

More Telugu News