: రైల్వే, న్యాయ మంత్రులకు పదవీగండం


బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికలో మార్పులు చేసిన పాపానికి న్యాయమంత్రి అశ్విని కుమార్ బలయ్యేట్లు ఉన్నారు. న్యాయమంత్రి, ప్రధాని కార్యాలయం అధికారులు, అటార్నీ జనరల్ తో బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను పంచుకున్నానని, వారి సూచనల మేరకు మార్పు చేశానంటూ సిబిఐ డైరెక్టర్ సుప్రీం కోర్టు ముందు ఒప్పేసుకున్న సంగతి తెలిసిందే. కోర్టు కూడా మంత్రి వ్యవహారాన్ని తప్పుబట్టింది. దీంతో అశ్విని కుమార్, ప్రధాని, మేనల్లుడి లంచం వ్యవహారంలో రైల్వే మంత్రి బన్సల్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

వీరి వ్యవహారం కారణంగా పార్టీ, ప్రభుత్వానికి మరింత నష్టం జరగకూడదని, వీరిని తొలగించే విషయమై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ ను కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, న్యాయమంత్రిని తప్పిస్తే తన రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుందని ప్రధాని తటపటాయిస్తున్నారని, అశ్విని కుమార్ ను తప్పించకుండా మరొక శాఖకు మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మేనల్లుడి లంచం వ్యవహారం రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ మెడకు చుట్టుకుంటోంది. ఈయనను కూడా తొలగించే అవకాశాలున్నాయంటున్నారు.

  • Loading...

More Telugu News