sandeep kishan: హారర్ నేపథ్యంలో యంగ్ హీరో మూవీ

- కార్తీక్ దర్శకత్వంలో హారర్ మూవీ
- సందీప్ కిషన్ జోడీగా అన్య సింగ్
- మొదలైన రెగ్యులర్ షూటింగ్
తెలుగు .. తమిళ భాషల్లో సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథా చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయన నటనకి మంచి మార్కులు పడుతున్నాయిగానీ, హిట్లు పడటం లేదు. దాంతో ఆయన కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కారణంగానే ఆయన కొంత సమయం తీసుకుని ఒక విభిన్నమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
