Puri Jagannath: పూరీ జగన్నాథుడి రత్నాల ఖజానా తాళం మాయం!

  • హైకోర్టు ఆదేశాలతో భారీ భద్రత
  • పూరీ శంకరాచార్య ఆగ్రహం
  • ప్రతిపక్ష బీజేపీ ఆందోళన

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నాల ఖజానా తాళం చెవులు పోయాయన్న వార్త సంచలనమైంది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ట్రెజరీ తాళం చెవులు అనుమానాస్పద రీతిలో మాయమైన సంగతి తెలిసిన పూరీ శంకరాచార్య, ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టాయి. ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు రామచంద్రదాస్ మహాపాత్ర ఈ విషయంపై స్పందిస్తూ ఏప్రిల్  4న నిర్వహించిన ఆలయ కమిటీ సమావేశంలో తాళం పోయిన విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. రత్న భాండార్‌లోని లోపలి చాంబర్ల తాళం చెవులు మాయమైనట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిపారు.

హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4న భారీ భద్రత నడుమ 16 మందితో కూడిన బృందం రత్న భాండార్‌లోకి ప్రవేశించి భద్రతను సమీక్షించింది. ఐరన్ గ్రిల్స్ ద్వారా ఇన్నర్ చాంబర్స్ బయటి నుంచి కనిపిస్తుండడంతో తనిఖీ బృందం లోపలికి వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.

తాళం చెవులు పోయిన ఘటనపై తాజాగా పూరీ శంకరాచార్య స్వామి మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెంటనే స్పందించాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News