: జ్ఞాపకశక్తిని పెంచే షాంపైన్‌


మనలో జ్ఞాపకశక్తిని పెంచడంలో షాంపైన్‌ కీలకంగా పనిచేస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. షాంపైన్‌లో ఉండే ఫినోలిక్‌ మిశ్రమాలు.. జ్ఞాపకశక్తితో ప్రమేయం ఉన్న మెదడు సామర్థ్యంతో ముడిపడి ఉన్న ప్రొటీన్లను మారుస్తాయని వారు అంటున్నారు. సాధారణంగా ఈ ప్రొటీన్లు వయస్సు పెరిగే కొద్దీ క్షీణిస్తుంటాయి. అయితే షాంపైన్‌తో దీన్ని అరికట్టవచ్చు అని.. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ రీడిరగ్‌కు చెందిన ప్రొఫెసర్‌ జెరెమీ స్పెన్సర్‌ చెబుతున్నారు.

వారానికి ఒకటిరెండు గ్లాసుల పరిమితమైన మోతాదులో షాంపైన్‌ తీసుకోవడం అనేది.. ఆరోగ్యానికి మేలే చేస్తుందని వారి వాదన. అయితే షాంపైన్‌ తీసుకోవడం ఇష్టంలేనివాళ్లు.. పోలీఫినాల్‌ సమృద్ధిగా ఉండే ఇతరత్రా ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందిట. అంటూ బ్లూబెర్రీ, కోకోవా వంటివి తింటే చాలునని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News