ummareddy venkateswarlu: వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డికి అస్వస్థత.. ప్రసంగిస్తూ పడిపోయిన నేత!

- నిన్న వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మారెడ్డి
- ప్రసంగిస్తూ కిందపడిపోయిన వైనం
- ప్రస్తుతం నిలకడగా ఉన్న ఆరోగ్యం
వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. నిన్న నెల్లూరులో నిర్వహించిన పార్టీ సభలో ఆయన పాల్గొన్నారు. అప్పటికే నీరసించి ఉన్న ఆయన... ప్రసంగిస్తూ కిందపడ్డారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ఉమ్మారెడ్డిని మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్దన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. ఉమ్మారెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు.