: గుండెకు మరింత బలాన్ని ఇచ్చే ఆక్రోటు
జీడిపప్పు తింటే ఆరోగ్యం పరంగా ఎంతో ప్రమాదకరం అని డాక్టర్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారో తెలియని సంగతి కాదు. అదే ఆక్రోటు అయితే.. అదే స్థాయిలో మన దేహాలకు మరింత మేలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆక్రోటు (వాల్‌నట్స్) వల్ల రక్తశుద్ధి పరంగా శరీరానికి రకరకాల ఉపయోగాలు ఉన్నట్లు మనకు తెలుసు. అయితే గుండె ఆరోగ్యం విషయంలోనూ ఇది చాలా కీలకం అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మామూలుగానే ఆక్రోట్ల వలన రక్తంలో కొలెస్టరాల్ మోతాదు తగ్గుతుంది. అయితే తాజాగా పెన్సిల్వేనియా యూనివర్సిటీ, టఫ్ట్‌స్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనల్లో ఆక్రోటు రక్తనాళాల గోడల్లోని పైపొర కణాల పనితీరును కాపాడుతోందని, గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడంలో ఇది కీలకం అని క్లేరీ బెర్రీమ్యాన్ చెబుతున్నారు. ఆక్రోటులో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్, గామా టోకో ఫెరాల్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. గుండె మరింత స్ట్రాంగుగా ఉండడానికి, మెరుగ్గా పనిచేయడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయిట.