: సాలీడు విషంతో.. కాస్తంత సేఫ్టీ ఉన్న మందులు


రీవర్‌ సాలీడు అంటే చాలా ప్రమాదకరమైనది. అది కరిస్తే.. అక్కడి కక్కడ చర్మం చచ్చిపోతుంది. రక్తస్రావంతో పాటు, కిడ్నీలు కూడా ఫెయిలవ్వొచ్చు. అయితే ఇంత ప్రమాదకరమైన రీవర్‌ సాలీడు విషాన్ని జాగ్రత్తగా వాడుకుంటే.. అందులోంచి విషం మీద విరుగుడుగా బాగా పనిచేయగల మెరుగైన మందును తయారుచేవచ్చునని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మామూలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషనిరోధకాలను కూడా విషంనుంచే తయారుచేస్తున్నారు. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఈ బెడద లేని ఔషధతయారీ సంకల్పంతో పరిశోధనలు సాగించిన చావెజ్‌ ఓలోర్‌టెగు దీన్ని కనుగొన్నారు. రీవర్‌ సాలీడు విషం నుంచి ఒక కొత్త ప్రొటీన్‌ను వీరు తయారుచేశారు. దానికి విషలక్షణాలు ఉండవు. మరి రెండు ప్రొటీన్లు కలిపి ఓ మందు రూపొందించారు. కుందేళ్లపై ప్రయోగిస్తే ఇది చాలా సమర్థంగా పనిచేస్తున్నట్లు చావెజ్‌ చెప్పారు.

  • Loading...

More Telugu News