Andhra Pradesh: మట్టి, ఇసుకతో పాటు వెంకన్న నగలు కూడా దోచుకున్నారు: వైసీపీ నేతల ఆరోపణ
- కేంద్రం అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు
- బాబు అరెస్టు కావడం, చిప్పకూడు తినడం ఖాయం
- ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు భూస్థాపితం చేశారు
మట్టి, ఇసుకతో పాటు వెంకన్న నగలను కూడా దోచుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం అంటే చంద్రబాబు భయపడిపోతున్నారని, బాబు అరెస్టు కావడం, చిప్పకూడు తినడం ఖాయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడే చంద్రబాబు, రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఏవిధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరుగుతున్నది మహానాడు కాదని మాయనాడు అని అన్నారు. కాగా, వైసీపీకి చెందిన మరో నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు భూస్థాపితం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు కోవర్టుగా పని చేశారని, రాహుల్ గాంధీతో చేయి కలిపారని ఆరోపించారు.