Chandrababu: చంద్రబాబునాయుడు గారూ.. ఏపీ రాష్ట్రం మీ చేతుల్లో ఉంటే రక్షణ ఉండదు!: వైఎస్ జగన్
- చిత్తూరులో బాలికపై అత్యాచారం సంఘటన కోపం తెప్పిస్తోంది!
- గత నెలరోజుల్లో నాల్గో సంఘటన ఇది!
- మీ అసమర్థ ప్రభుత్వం మహిళలకు సరైన భద్రత కల్పించట్లేదు
- మీ ప్రభుత్వ పనితీరు చాలా చెండాలంగా ఉంది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఈ మేరకు జగన్ ఓ ట్వీట్ చేశారు. ‘చిత్తూరులో పన్నెండు సంవత్సరాల బాలికపై అత్యాచారం సంఘటన వార్త కోపం తెప్పిస్తోంది. గత నెలరోజుల్లో ఒక మైనర్ పై లైంగిక దాడి జరిగిన నాల్గో సంఘటన ఇది. చంద్రబాబు నాయుడుగారూ! మహిళలకు సరైన భద్రత కల్పించని మీ అసమర్థ ప్రభుత్వం పని తీరు చాలా చెండాలంగా ఉంది. ఏపీ రాష్ట్రం మీ చేతుల్లో ఉంటే రక్షణ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది’ అని జగన్ విమర్శించారు.