bs yedurappa: పోలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ కొత్త వివాదాన్ని రేపిన యడ్యూరప్ప... ఈసీకి లేఖ

  • షెడ్డులో పడి ఉన్న వీవీపీఏటీ అంశాన్ని ఉదహరించిన యడ్యూరప్ప
  • ఎన్నికల ముందే ఆందోళన వ్యక్తం చేసినా ఈసీ పట్టించుకోలేదు
  • ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని విశ్వాసం

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలం నిరూపించుకోవడానికి ముందే తప్పుకున్న బీఎస్ యడ్యూరప్ప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ కొత్త వివాదానికి తెరతీశారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఓ లేఖ రాశారు. ‘‘విజయ్ నగర్ జిల్లాలోని మనగులి గ్రామంలో ఓ షెడ్డులో పడి ఉన్న ఓటర్ నమోదు ధ్రువీకరణ మెషిన్లు (వీవీపీఏటీ) అంశాన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంటుందని విశ్వసిస్తున్నాను. ఈ ఘటన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగి ఉంటాయని సూచిస్తోంది’’ అని యడ్యూరప్ప తన లేఖలో పేర్కొన్నారు.

 ఎన్నికల ముందే బీజేపీ దీనిపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఈసీ పట్టించుకోలేదని యడ్యూరప్ప గుర్తు చేశారు. ‘‘క్షేత్ర స్థాయిలో ఎన్నికల పోలింగ్ లో అక్రమాలను ఈసీ దృష్టికి తీసుకురావడం ఇదే మొదటి సారి కాదు. ఈ తరహా ఎన్నో అవకతవకలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది’’ అని యడ్యూరప్ప తెలిపారు.

More Telugu News