: దుగరాజపట్నంలో ప్రధాన ఓడరేవు ఏర్పాటు: కేంద్రం
రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో మరో అతిపెద్ద ఓడరేవు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఈ విషయం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లోని సాగట్ తో పాటు దుగరాజపట్నంలో ఓడరేవులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. మొత్తం రూ. 7,982 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అంతేగాకుండా, రామగుండంలో మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు భారీగా నిధులు కేటాయించింది.