Telugudesam: తెలుగు రాష్ట్రాల్లో, కేంద్రంలో ఆ మూడు పార్టీలే అధికారంలోకొస్తాయి: ఎంపీ జేసీ జోస్యం
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ లకు అధికారం దక్కుతుంది
- కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తుంది
- కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ లు తమ బలం నిరూపించుకునే అవకాశముంది
వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అధికారంలోకి వస్తాయనే విషయమై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 105వ జయంతి సందర్భంగా అనంతపురంలోఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపైనా ఆయన స్పందించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.