: పాపం.. ఇమ్రాన్ ఖాన్!
పాకిస్తాన్ లో రెండ్రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభ వేదిక చేరుకునే ప్రయత్నంలో ఫోర్క్ లిఫ్ట్ కూలి తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరికొద్ది రోజులు ఆసుపత్రికే పరిమితవ్వాల్సి వస్తోంది. మే 11న పాకిస్తాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తలకు, వెన్నెముకకు బలమైన గాయాలు కావడంతో ఇమ్రాన్ కొంతకాలం పాటు ఆసుపత్రిలోనే ఉండాలని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీంతో, ఆయన ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ స్థాపించి పాక్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.