Andhra Pradesh: బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో అందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు.

బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ప్రజలకు వివరిస్తామని, కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని కన్నా అన్నారు.
Andhra Pradesh
kanna

More Telugu News