Telugudesam: టీడీపీకి టాటా చెప్పిన మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్ వెంకటేశ్.. కాంగ్రెస్‌లో చేరిక

  • టీడీపీలో కొనసాగుతున్న వలసలు
  • 18న కాంగ్రెస్‌లోకి వంటేరు
  • శుక్రవారం అకస్మాత్తుగా పార్టీ మారిన వెంకటేశ్

తెలంగాణ టీడీపీలో వలసలు కొనసాగుతున్నాయి. నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో కీలక నేతగా పేరున్న పార్టీ ఇన్‌చార్జ్ వెంకటేశ్ పార్టీకి టాటా చెప్పి శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఆయనతోపాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ మారినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావులు ఈనెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరునున్న తరుణంలో అంతకుముందే వెంకటేశ్ అకస్మాత్తుగా కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News