Chandrababu: అమిత్ షాకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే!: తెలంగాణ బీజేపీ డిమాండ్

  • చంద్రబాబు నాయుడికి తెలిసే అమిత్‌ షాపై దాడి
  • అమరావతిలోనే కుట్ర 
  • తిరుపతిలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు

ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ ఈ రోజు తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసే ఈ దాడి జరిగిందని ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు. అమరావతిలోనే ఈ కుట్రకు ప్రణాళిక వేశారని ఆరోపించారు. ఇందుకు గానూ అమిత్ షాకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన అన్నారు.

ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమిత్‌ షాపై దాడి చేశారని, చంద్రబాబే ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు. దేశ వ్యాప్తంగా తమ పార్టీ విజయాలను జీర్ణించుకోలేకే  ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News