పోలీస్‌ స్టేషన్‌లో నటుడిపై చెప్పులతో దాడి.. శ్రీరెడ్డి, ఆమె అనుచరులపై కేసు నమోదు

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో యువనటి శ్రీరెడ్డితో పాటు ఆమె అనుచరులపై ఈ రోజు కేసు నమోదైంది. నిన్న సహాయనటుడు శ్రీశాంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సహాయ నటి రోజా యువనటి శ్రీరెడ్డిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. శ్రీశాంత్ రెడ్డి కూడా పోలీసు ఎదుట విచారణకు వచ్చాడు. అయితే, పోలీసుల ఎదుటే శ్రీశాంత్ పై శ్రీరెడ్డితో పాటు ఆమె అనుచరులు చెప్పులతో దాడి చేశారు.
                                                   
దీంతో పోలీస్ స్టేషన్ లో ఇటువంటి ప్రవర్తనకు గానూ శ్రీరెడ్డి, ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు. సహాయనటి రోజా, నటుడు శ్రీశాంత్ రెడ్డికి చాలా కాలంగా గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది.

Police
Hyderabad
srireddy

More Telugu News