smartron tband: మీ గుండె పనితీరు ఎలా ఉందో అనుక్షణం చెప్పే స్మార్ట్ బ్యాండ్

  • చేతికి ధరించే స్మార్ట్ బ్యాండ్ ను ఆవిష్కరించిన స్మార్ట్ రాన్
  • ఈసీజీ, బీపీ, కేలరీల ఖర్చు, నిద్ర గురించి చెబుతుంది
  • ఈ నెల 13 నుంచి ఫ్లిప్ కార్ట్ లో విక్రయం
  • దీని ధర రూ.4,999

దేశీయ కంపెనీ స్మార్ట్ రాన్ అత్యాధునిక ఫీచర్లతో ఓ స్మార్ట్ బ్యాండ్ ను తీసుకొచ్చింది. సాధారణంగా కేలరీల ఖర్చు, గుండె స్పందనలను తెలియజేసే స్మార్ట్ బ్యాండ్ లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. వీటికి భిన్నంగా స్మార్ట్ రాన్ ‘టిబ్యాండ్’ గుండె స్పందనలతోపాటు గుండె పనితీరును కూడా మరింత వివరంగా ఈసీజీ గ్రాఫ్ రూపంలో స్క్రీన్ పై చూపిస్తుంది.

ఇంకా బీపీ ఎంతుందో కూడా అనుక్షణం చెబుతుంటుంది. చూడమచ్చటగా, లైట్ వెయిట్ తో ఉంటుంది. కేలరీల లెక్కలు, మీరు నిద్రించే విధానం, మీ పనితీరును కూడా ట్రాక్ చేస్తుంది. ఇంకా మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 13 నుంచి ఇది విక్రయానికి రాబోతుంది.

ఈ స్మార్ట్ బ్యాండ్ లో 0.96 అంగుళాల స్క్రీన్, ఓఎల్ఈడీ టచ్ తో కూడిన డిస్ ప్లే, ఎంటీకే 2523 ఎస్ వోసీ, 4ఎంబీ ర్యామ్, 100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ ద్వారా ఫోన్ కు కనెక్ట్ చేసుకుంటే ఎస్ఎంఎస్ లు, కాల్స్ వచ్చినా టిబ్యాండ్ స్క్రీన్ పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీని ధర రూ.4,999.

  • Loading...

More Telugu News