Chandrababu: వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి పంపిణీ: సీఎం చంద్రబాబు

  • కార్యాచరణ ప్రారంభించాలి .. పారదర్శకంగా ఉండాలి
  • రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలి
  • ఫ్యాక్షన్ రాజకీయాలను అదుపు చేశాం

వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఆయన ప్రస్తావించారు. సమాజంలో అశాంతి ఉంటే శాంతిభద్రతల సమస్య వస్తుందని, ఆ సమస్య లేకుండా చూసుకోవాలని అన్నారు.

అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు ప్రజలను మోసం చేశాయని, మోసానికి గురైన ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను అదుపు చేశామని, ఎర్రచందనం స్మగ్లింగ్ ని అడ్డుకున్నామని అన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వేలం వేయడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News