: జులైలో నారా లోకేశ్ పొలిటికల్ ఎంట్రీ!
ప్రస్తుతం ట్విట్టర్ కే పరిమితమైన నారా లోకేశ్ ఇక పూర్థిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తనున్నారు. మరో రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. జులై రెండో వారంలో అధికారికంగా లోకేశ్ రాజకీయ రంగప్రవేశం ఉండవచ్చని తెలుస్తోంది. జూన్ లో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి విద్యాభ్యాసం ముగించుకుని వస్తున్నారు. ఆమెకు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించి తాను పూర్తిస్థాయి రాజకీయనేత అవతారమెత్తాలని లోకేశ్ భావిస్తున్నారు.
కాగా, త్వరలో చంద్రబాబు యువత డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. ఈ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను లోకేశ్ కు అప్పగించాలని బాబు నిర్ణయించినట్టు సమాచారం. ఇక లోకేశ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొందరేమో, లోకేశ్ కు యువ విభాగం బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. ఏదేమైనాగానీ, మరికొద్ది నెలల్లో లోకేశ్ రాజకీయ అరంగేట్రం ఖాయమైనట్టే.