: 'వందేమాతరం' వివాదంలో ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
లోక్ సభలో వందేమాతరం గీతం వస్తుండగా, నిర్లక్ష్యంగా బయటికెళ్ళిపోయిన బీఎస్పీ ఎంపీ షఫీఖ్ ఉర్ రహ్మాన్ తాను చేసింది తప్పు కానేకాదంటున్నారు. వందేమాతరం ఏమీ జాతీయ గీతం కాదని, అది కేవలం మాతృభూమికి సంబంధించిన గీతమని సరికొత్త భాష్యం చెప్పారు. పైగా, తాము ముస్లింలమని, అల్లా ముందు తప్ప మరెక్కడా మోకరిల్లమని చెప్పుకొచ్చారు. తాను వందేమాతరం వస్తున్నప్పుడు సభను వీడడం ఇదే తొలిసారి కాదని, చాలాసార్లు ఇలా చేశానని నిస్సిగ్గుగా చెప్పారు. ఈ ఉత్తరప్రదేశ్ ఎంపీ నిన్న వందేమాతరం గీతం వినవస్తున్న సమయంలో సభను వీడడంపై స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.