: మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే: ఆనం వివేకా


సరదాగా మాట్లాడడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిది అందెవేసిన చేయి. నేడు సుప్రీం కోర్టు జగన్ కు బెయిల్ నిరాకరించడంపైనా తనదైన శైలిలో వ్యాఖ్యానించి అందర్నీ నవ్వించారు. జగన్ కు బెయిల్ రాకపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు.

బాబు మోకాలి నొప్పితో ఢిల్లీలో బాధపడుతూ ఉంటే, ఆయన వెళ్ళి మంత్రాంగం నెరిపి జగన్ కు బెయిల్ రానీయకుండా అడ్డుపడారనడం హాస్యాస్పదమన్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. జగన్ కు బెయిల్ వస్తుందని ఆశించిన నేతలను అజ్ఞానులతో పోల్చారు వివేకా. అంతేగాకుండా, ఏడాది రాష్ట్ర బడ్జెట్ ను దోచుకున్న వ్యక్తికి ఎలా బెయిల్ లభిస్తుందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News