Tollywood: ‘మా’ లో సభ్యత్వం కోసం డబ్బులు కట్టిన శ్రీరెడ్డి.. పోరాటం ఆగదంటూ వ్యాఖ్య
- సిని పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి
- తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇవ్వాలంటూ డిమాండ్
- సమస్యలపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరిక
తెలుగు సిని పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం కోసం రుసుము చెల్లించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తెలిపింది. అలాగే తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇవ్వాలని, కాస్టింగ్ కౌచ్ నిరోధక ప్రత్యేక కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని శ్రీరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. మరోవైపు, 'మా'లో సభ్యత్వం కోసం ఆమె రుసుము చెల్లించినప్పటికీ... ఆమెకు సభ్యత్వం ఇస్తారా? లేదా? అనే విషయంలో మాత్రం సందేహం నెలకొంది.