: దేశానికి కొత్త న్యాయశాఖ మంత్రి?


బొగ్గు కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ కు పదవీగండం పొంచి ఉంది. నిన్నటితో కర్ణాటక ఎన్నికల క్రతువు ముగియడంతో ప్రధాని మన్మోహన్ ఈ అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అశ్వినీ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు ఎలుగెత్తుతున్న నేపథ్యంలో ఆయనను తొలగించి కొత్త మంత్రిని నియమించడమో, లేక మరో మంత్రికి అదనంగా న్యాయశాఖను అప్పగించడమో చేయాలని ప్రధాని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ప్రధానితో అశ్వినీ కుమార్ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News