Tollywood: నిర్మాత బి.ఏ. రాజుకు దాసరి జీవన సాఫల్య పురస్కారం!
- ఈనెల ఆరో తేదీన త్యాగరాయ గానసభలో అవార్డుల ప్రదానం
- ముఖ్యఅతిథిగా సీనియర్ నటి జమున
- సభాధ్యక్షుడిగా కైకాల సత్యనారాయణ
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ - దాసరి 2018 ఫిలిం అవార్డులను ఈనెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేయనుంది. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని నిర్మాత బి.ఏ.రాజుకు, దాసరి కీర్తి కిరీట సిల్వర్ క్రౌన్ అవార్డును దర్శకుడు కోడి రామకృష్ణ, టీవి యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కే.ధర్మారావు ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ నటి జమున హాజరు కానుండగా, సభాధ్యక్షుడిగా కైకాల సత్యనారాయణ వ్యవహరించనున్నారు.
ఇతర అవార్డులు:
- డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ (ఫిదా): శేఖర్ కమ్ముల
- ఉత్తమ గేయ రచయిత: సుద్దాల అశోక్‌తేజ
- ఉత్తమ గాయని: మధుప్రియ
- ప్రశంసా దర్శకుడు అవార్డు: వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్)
- దాసరి ప్రతిభా పురస్కారం: సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, వాసూరావు, సంజీవి
- దాసరి విశిష్ట సేవా పురస్కారం: డా. ఎ.నటరాజు