: పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమారుడి అపహరింత


పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. పాక్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కుమారుడు అలీ హైదర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హైదర్ నేడు ముల్తాన్ పట్టణంలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదర్ ను అపహరించే క్రమంలో దుండగులు ఆయన భద్రత సిబ్బందిలో ఇద్దరిని హతమార్చారు. అయితే, ఈ ఘటన పాక్ తాలిబాన్ల పనే అని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, పాక్ లో ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే తమ లక్ష్యమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News