mi 4a tv: ఎంఐ నుంచి మరో స్మార్ట్ టీవీ... 4ఏ యూత్ ఆవిష్కరణ

  • మన కరెన్సీలో రూ.17,800గా ధర ఖరారు
  • 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
  • 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ
  • త్వరలో భారత మార్కెట్లోకి!

చైనా కంపెనీ షియోమీ ‘ఎంఐ’ బ్రాండ్ కింద ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీని చైనాలో ఆవిష్కరించింది. దీని ధరను 1,699 యువాన్లుగా ఖరారు చేసింది. మన కరెన్సీలో చూస్తే రూ.17,800. ఎంఐ 4ఏ మోడల్ ను షియోమీ భారత్ లో మార్చిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులోనే 4ఏ యూత్ ప్రత్యేక వెర్షన్. ప్రస్తుతం మన దేశంలో ఎంఐ 4 స్మార్ట్ 4కే టీవీ 55 అంగుళాల మోడల్ ను రూ.44,999కు, 4ఏ 32 అంగుళాల టీవీ రూ.13,999కు, 4ఏ 43 అంగుళాల టీవీని రూ.22,999కు విక్రయిస్తోంది. త్వరలో 4ఏ యూత్ ను ఇక్కడ విడుదల చేసే అవకాశం ఉంది.

4ఏ యూత్ టీవీ 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. రీఫ్రెష్ రేటు 60 గిగాహెర్జ్, 178 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూసే వీలు, 1.5 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ అమ్లోజిక్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. వైఫై, రెండు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, ఈథర్ నెట్ పోర్ట్, ఏవీ కాంపోనెంట్ పోర్ట్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News